తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన అందంతో నటన ఎంతో మంది ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు పైనే అవుతోంది.. ఇక ఈమె వయసు పెరుగుతున్న కూడా అందం విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తూ ఉన్నది. ఇక ఈ మధ్య స్టార్ హీరోల అందరితో కూడా నటించిన ఘనత దక్కించుకుంది. ఒకవైపు సీనియర్ హీరోలతో మరొకవైపు యంగ్ హీరోలతో కూడా నటించి వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది.అయితే ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త డల్ అయినట్లుగా కనిపిస్తోంది తమన్నా. అయితే ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కు మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.సినిమాలలో కూడా అడపా దడపా గానే నటిస్తూ ఉన్నది. ఇక పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నది. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలలో సినిమాలో నటిస్తున్నప్పటికీ తన అంద చందాల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు అన్నట్టుగా చూపిస్తోంది. అయితే తమన్నా తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. తమన్నా అందానికి తగ్గట్టుగానే అదే స్కిన్ టోన్ తో బాగా వెలిగిపోతున్నట్లుగా ఈ ఫోటోలో కనిపిస్తున్నది.ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె అందం గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ ఫోటో షూట్లతో యువ హీరోలను సైతం బాగా ఆకర్షించి అవకాశం ఉన్నట్లు గా చెప్పవచ్చు.. ఇక ఈమె అందంతో మరొకసారి యువ హీరోలు సైతం ఆఫర్లు ఇవ్వాల్సిందే అన్నట్లుగా తన అందంతో అందరినీ ఆకర్షిస్తుంది. ఇక చివరిగా తమన్నా F-3 సినిమాతో బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఈమె చిరంజీవితో కూడా ఒక సినిమాలో నటించే అవకాశాన్ని సంపాదించుకున్నట్లుగా సమాచారం. ఇక అభిమానుల సైతం ఈమె వివాహం ఎప్పుడు అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: