ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కె.రాఘవేంద్రరావు. అప్పటి ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ కూడా తన మేకింగ్ స్టైల్ తో తెలుగు ప్రేక్షకుల అందర్నీ కూడా ఆకర్షించాడు రాఘవేంద్రుడు. ముఖ్యంగా రొమాంటిక్ సినిమాలు తెరకెక్కించాలని అంటే రాఘవేంద్రరావు తర్వాతే ఇంకెవరైనా అనే భావన తెలుగు ప్రేక్షకులలో తెచ్చి పెట్టాడు. అంతేకాదు ఇక హీరోయిన్లను అందంగా చూపించడంలో కూడా ఇక రాఘవేంద్రరావు కి పోటీ ఎవరు లేరు అని ఇప్పటికి కూడా ప్రేక్షకులు నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన.


 కేవలం రొమాంటిక్ సినిమాలతో మాత్రమే సరిపెట్టుకోకుండా అన్నమయ్య శ్రీరామదాసు లాంటి సినిమాలను తెరకెక్కించి ఆయన దర్శకత్వం లో ఉన్న మరో కోణాన్ని చూపించారు. ఇక ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆయన మేకింగ్ స్టైల్ నచ్చి అప్పట్లో ఎంతో మంది హీరోయిన్లు ఆయన దర్శకత్వంలో నటించాలని తెగ ఆసక్తి చూపేవారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు కాస్త వయసు పెరిగిపోయిన నేపథ్యంలో ఇక వరుసగా సినిమాలు చేయడం లేదు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. అయితే ఆయన ఏ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించినా ఆయన పేరు పక్కన  ఆయన చదివిన డిగ్రీ బిఏ అని ఉంటుంది అనే విషయం తెలిసిందే.



 రాఘవేంద్ర రావు బిఏ అనే పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. తన పేరు పక్కన బిఏ అని పెట్టుకోవడానికి గల కారణం ఏంటో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాఘవేంద్రరావు. తాను దర్శకత్వం వహించిన సినిమాలకు బిఏ అని పెట్టాను. ఈ క్రమంలోనే వరుసగా రెండు మూడు సినిమాలు మంచి హిట్టయ్యాయి. కానీ తర్వాత తన పేరు పక్కన బి ఏ పెట్టకుండా మరో సినిమా విడుదల చేస్తే అది ఫ్లాప్ అయ్యింది. దీంతో అప్పటి నుంచి నా పేరు వెనుక బిఏ అనే పదం సెంటిమెంట్ గా అనిపించింది. దీంతో ఇక తన పేరు చివరన బిఏ అన్నది ప్రతి సినిమాలో వుండాలని నిర్ణయించుకున్నాను అంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: