లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమా ఏ రేంజ్ విజయాన్ని ఆ కాలంలో సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇటు ప్రేక్షకుల నుండి , అటు విమర్శకుల నుండి కూడా అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీ లో హీరో గా కమల్ హాసన్ కు , ఈ మూవీ కి దర్శకత్వం వహించిన శంకర్ కు అద్భుతమైన ఈ మూవీ గొప్ప ప్రతిష్ట ను తీసుకు వచ్చింది. భారతీయుడు సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి సీక్వెల్ గా దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ లుగా  ఇండియన్ 2 మూవీ ని కొంత కాలం క్రితం ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. 

కొంత భాగం సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచి పోయింది. దానితో కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలో నటించి ఇప్పటికే విడుదల చేయగా , దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే శంకర్ తిరిగి మళ్ళీ ఇండియన్ 2 మూవీ ని ప్రారంభించ బోతున్నాడు.  ఇది ఇలా ఉంటే అందుకు సంబంధించి తాజాగా ఈ మూవీ యూనిట్  ఒక అప్డేట్ ను కూడా విడుదల చేసింది.  తాజాగా ఇండియన్ 2 చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో హి హిస్ బ్యాక్ అంటూ మూవీ యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే భారతీయుడు మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇండియన్ 2 మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: