డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర.. ఈ సినిమాని మూడు భాగాలు గా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ బ్రహ్మాస్త్ర అనే పేరుతో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, ఆలియా భట్, షారుక్ ఖాన్, నాగార్జున, అమితాబచ్చన్, మౌని రాయ్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమా పైన మరింత అంచనాలను పెంచేసాయి.


బాలీవుడ్ మూవీ ను తలపిస్తున్న ఈ విజువల్ ఎఫెక్ట్ తో ట్రైలర్ ని చూపించడం తో ఈ సినిమా కి  హైప్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో మరింత అంచనాలు ప్రతిరోజు పెరిగిపోతూనే ఉన్నాయి ప్రేక్షకులలో.. దక్షిణాదిలోని డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందంతో కలిసి పలు ప్రమోషన్ పనులను కూడా ప్రారంభించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా కోసం JR. టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నారు. సెప్టెంబర్ 2న హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ లో సాయంత్రం 6 గంటల సమయంలో  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు . ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది.



ఇక అంతే కాకుండా రణబీర్ ,ఆలియా, నాగార్జున, అమితాబ్ సైతం ఈ సినిమా ప్రీ రిలీజ్  ఈవెంట్ కి కూడా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం. rrr సినిమా లో ఉండే తారక్ పాత్రులకు సంబంధించి సీన్స్ బ్రహ్మాస్రా సినిమా లోని  రణవీర్ పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాలను కలిపి ఒక స్పెషల్ వీడియో ద్వారా విడుదల చేశారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ వీడియో కాస్త చాలా వైరల్ గా మారుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: