బాలీవుడ్ నటుడు నిర్మాత రచయిత కమల్ రషీద్ ఖాన్ ను ముంబైలో అరెస్టు చేయడం జరిగింది. కె.ఆర్.కె ట్వీట్ చేస్తు వివాదాస్పందంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోని తాజాగా ఈయన అరెస్టు అవ్వడం జరిగింది 2020లో ఆయన చేసిన ఒక వివాదాస్పందమైన ట్వీట్ మలాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. దీంతో ఇతనిని ప్రశ్నించేందుకు పోలీసులు ఆయనను ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది.. నేడు ఆయనను బోరివలి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఈయన బిగ్ బాస్ త్రీ లో కూడా పాల్గొన్నారు.



కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్,మనోజ్ భాయ్ గతంలో కూడా కేసు వేశారు సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తున్నాయని వసూలు రావడంలేదని కె.ఆర్.కె ట్వీట్ చేయడం జరిగింది. రాధే శ్యామ్, మోస్ట్ వాంటెడ్ బాయ్ రిలీజ్ అయినప్పుడు కేఆర్ కే ఈ ట్వీట్ లను మరి పోస్ట్ చేశారు. సినిమా బాగాలేదని రివ్యూ ఇవ్వడమే కాకుండా కలెక్షన్లలోను ప్లాప్ అంటూ విమర్శలు సైతం చేయడం జరిగింది దీంతో అప్పట్లో సల్మాన్ ఖాన్ చాలా సీరియస్ గా అయ్యారు.. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కమల్ వ్యాఖ్యలు చేశారని కూడా తెలియజేశారు.


అందుకోసం సల్మాన్ ఖాన్ తరఫున న్యాయవాది కోర్టులో కేసు వేయడం జరిగింది దీంతో అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఆదేశించడం జరిగింది. అలాగే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ని సాఫ్ట్ పోర్న్ సిరీస్గా ట్రీట్ చేయడం జరిగింది దీంతో పాటు.. మనోజ్ భాయ్ భార్య కుమార్తె గురించి కూడా పలు అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో మనోజ్ సైతం కోర్టులో పరువు నష్ట ధావ వేయడం జరిగింది. అలాగే పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన rrr చిత్రానికి కూడా నెగిటివ్ రివ్యూ ను ఇచ్చారు ఇటీవలే లైగర్ సినిమా కూడా విడుదల అందులో కూడా తల దూర్చి అందరి చేత బుక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: