ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ లలో బ్రహ్మాస్త్ర మూవీ ఒకటి. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ హీరో గా నటించగా , అయాన్ ముఖర్జీమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ఆలియా భట్ , అమితా బచ్చన్ ,  నాగార్జున , మౌని రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించ బోతున్నారు. మూడు భాగాలుగా తిరకక్కనున్న బ్రహ్మాస్త్ర మూవీ మొదటి భాగం బ్రహ్మాస్త్ర : శివ సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బ్రహ్మాస్త్ర మూవీ ని ఇండియా వ్యాప్తంగా 5000 థియేటర్ లలో  ,  అలాగే ఓవర్ సీస్  లో 3000 థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయాలి అని మూవీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఇండియాలో ఏ మూవీ ని విడుదల చేయనన్ని థియేటర్ లలో ఈ మూవీ ని విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా ఆ ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలి అంటే సెప్టెంబర్ 9 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: