టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన సుధీర్ బాబు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ఇంద్రగంటి మోహనకృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ను అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ ని సెప్టెంబర్ 5 వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియ జేస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి. ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టు కోవడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టు కున్నారు. ఇది ఇలా ఉంటే సుధీర్ బాబు ఈ మూవీ తో ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. సుధీర్ బాబు ,  ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో ఇది వరకు సమ్మోహనం , వి మూవీ లు తెర కెక్కాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో హైట్రిక్ మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి: