విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలై ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో మైక్ టైసన్ నటించిన ఈ సినిమాకు మరింత హైప్ పెరగడం జరిగింది. ఈ చిత్రాన్ని పూరి కనెట్స్ కరణ్ జోహార్, పూరీ, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం మొదటి రోజు నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. అయితే టాకుతో సంబంధం లేకుండా మొదటి రోజు వసూళ్ల పరంగా బాగానే రాబట్టింది.


ఇక రెండవ రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి ఇప్పుడు వీకెండ్ ని ఏ మాత్రం వాడుకోలేకపోయింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా ఇప్పటివరకు ఎంతటి కలెక్షన్లను రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

1). నైజాం-5.70 కోట్ల రూపాయలు.
2). సీడెడ్ -1.85  కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-1.78 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-88 లక్షలు
5). వేస్ట్-56 లక్షలు
6). గుంటూరు-కోటి రూపాయలు.
7). కృష్ణ-71 లక్షలు.
8). నెల్లూరు-54 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్ల విషయానికి వస్తే..13.2 కోట్ల రూపాయలు.
10). తమిళనాడు-33 లక్షలు.
11). కేరళ-29 లక్షలు.
12). కర్ణాటక-99 లక్షలు.
13). హిందీ-8.53 కోట్ల రూపాయలు.
14). ఓవర్సీస్-3.41 కోట్ల రూపాయలు.
15). ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కలెక్షన్ల విషయానికి వస్తే..26.57 కోట్ల రూపాయలు.

లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.82.15 కోట్ల రూపాయలు జరగదా ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే  రూ.83 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది.. అయితే ఈ సినిమా పది రోజులు పూర్తి అయ్యేసరికి కేవలం రూ.26.57 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే ఇంకా రూ.56 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించాలి. అయితే అన్ని భాషలలో ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను తెచ్చుకొని వెనకబడి ఉండగా.. ఒక బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా బాగానే ఆడుతోంది. అయితే మరి ఇంతటి కలెక్షన్లను రాబట్ట లేదని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: