పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రూపొందుతుంది. గత కొంతకాలంగా ఈ సినిమా వాయిదా పడింది అని వస్తున్న వార్తలకు చెక్కు పెడుతూ తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఆగిపోయిందనుకున్న సినిమా మొదలవడం పవన్ అభిమానులలో ఒక్కసారిగా సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమాను దాదాపుగా పక్కన పెట్టేసాడని అందరూ అనుకున్నారు.

కానీ క్రిష్ ఈ కథలో ఉన్న దమ్మును మరొకసారి పవన్ కళ్యాణ్ కి గుర్తు చేసి ఈ సినిమా చేసే విధంగా ఆయనను మలిచారని చెబుతున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలను కూడా చేయవలసి ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను ఆయన చేయవలసి ఉండగా అది ఇంకా మొదలు పెట్టకపోవడం ఈ సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలను కలుగ జేస్తుంది.

అంతేకాదు సముద్రఖని దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్సినిమా చేయడానికి నిర్ణయించారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా తెలియడం లేదు. ఈ చిత్రంలో సాయి ధరంతేజ్ కూడా మరొక హీరోగా నటిస్తూ ఉండగా త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తున్నారు.  ఈ మూడు సినిమాలలో ఎప్పుడు ఏది మొదలవుతుందో అని అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీని పట్ల పవన్ ఆలోచన ఎవరికీ అర్థం కాకపోవడం ఇక్కడ పవన్ అభిమానులను కూడా కొంత నిరాశ పరుస్తుంది. ఈ సినిమాతో పాటే పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయవలసి ఉంది. దీనిని ఎలక్షన్స్ కు ముందుగానే పూర్తి చేయాలని ఆయన భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలన్నీ ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి. పవన్ కళ్యాణ్ కి ఫాన్ బేస్ ఎక్కవగా ఉన్న నేపథ్యంలో అయన సినిమాలకు ఇంత డిమాండ్ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: