యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కంటే మించిన స్థాయిలో తేరకెక్కించ బోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించ నుండగా , రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేయనున్నాడు. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేరు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో అలనాటి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతిమూవీ లో ఎన్టీఆర్ కి అత్త పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే విజయశాంతి కొంత కాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవరు మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: