ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీగా వున్నాడు.ఆయన అన్న బాటలోనే తాను కూడా జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనే తపనతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రజలతో మమేకం అవడం వారి కష్టాలను తెలుసుకొని వారికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి కూడా చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్.. ఇదిలావుంటే తాజాగా పరుచూరి గోపాలకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అంటే అలా చేయాల్సిందే అంటూ కొన్ని విషయాలు తెలిపారు.ఇదిలావుంటే పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పాఠాలు పేరుతో యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం జరిగింది.

ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తన సినీ కెరియర్ లో 27 సినిమాల వరకు చేసి ఉంటాడు. ఒక సమయంలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా వెళ్ళాడు..  ఆ తర్వాత డిజాస్టర్ లను కూడా మూట కట్టుకున్నాడు.  అత్తారింటికి దారేది సినిమాతో ప్రజలను తికమక పెట్టేశాడు. అయితే మళ్లీ ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్టు ఎంచుకుంటున్నాడు.. సినిమా వేరు .. రాజకీయం వేరు..కర్ణాటక, తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. ఇకపోతే ఒక పార్టీకి సపోర్టుగా నిలబడడం వేరు.. ఒకసారి పార్లమెంటుకు వెళ్లి వద్దాం అనుకోవడం వేరు.. సమాజాన్ని తన దృక్పథంలో మార్చాలనే ఆశయం ఉండడం వేరు.ఇక  ఆ ఆశయం పవన్ కళ్యాణ్ కి ఉంది.

ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన పోరాటం తాను చేసుకుంటూ పోయే వాడే వీరుడు..ఇక  2019 ఎన్నికల్లో పవన్ తనకంటూ అస్తిత్వాన్ని నిరూపించుకుందాం అని నిలబడితే.. ఆ పార్టీ అధికారంలోకి రాలేదు.అయితే  ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశయంతో 2024 లో జరిగే ఎన్నికల కోసం ఆయన ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు.. ఎన్టీఆర్, కృష్ణ అధికారంలోకి రావడానికి బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, ఈనాడు వంటి సినిమాలను ఎంచుకొని మంచి నాయకుడిగా ప్రజలలో గుర్తింపు సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక అద్భుతమైన చిత్రాన్ని ఎంచుకోవాలి . అంతేకాదు ప్రజల్లోకి వెళ్లే విధంగా చేయగలగాలి. ఓటర్లు ఎప్పుడూ ఒకేల ఉండరు. వాళ్లకు కొన్ని ఆశయాలు, ఆశలు ఉండడం సహజం.వాటిని ఎవరు నెరవేరుస్తారో వారి వైపే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు చట్టసభల్లోకి రావాలని ఆశీర్వదిస్తున్నాను.. ఆయన నిజంగా సీఎం అవుతారని ఆకాంక్షిస్తున్నాను అంటూ గోపాలకృష్ణ తెలపడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: