తమిళ్ లో స్టార్ హీరో అంత రేంజ్ లో కాకపోయినా, మినిమం గ్యారంటీ హీరోగా ఆర్య తన కెరీర్ ను వెళ్లదీస్తున్నారు . ఇతను నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ విడుదల అవుతుండడం వలన ఇక్కడ కూడా తనకు మంచి ఆదరణ దక్కుతోంది. అయితే ఆర్య కు ఇటీవల సరైన హిట్ పడలేదు. అందుకే ఆర్య దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ తో కలిసి కొత్త కాన్సెప్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమా ట్రైలర్ వచ్చే వరకు ఎవ్వరికి దీని గురించి తెలియదు. కానీ ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా హైప్ ఏర్పడింది. ముఖ్యంగా ఇందులో మెయిన్ కాన్సెప్ట్ అందరినీ బాగా ఆకట్టుకుంది.

అదే అంచనాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కెప్టెన్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు అని తెలుస్తోంది. దర్శకుడు కాన్సెప్ట్ ను కొత్తగా రెడీ చేసుకున్నా ఈ విషయాన్ని ఒక కథ రూపంలో ప్రేక్షకుడికి చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. ఒక వింత జీవులతో ఇండియన్ ఆర్మీ చేసే పోరాటమే ఈ సినిమా ఇతివృత్తం. కానీ దీనిని చాలా పేలవంగా డైరెక్ట్ చేయడం నిరాశపరిచే విషయం. ఇంకా సినిమా చూస్తున్నంత సేపు ఎన్నో లాజిక్కులను సునాయాసంగా దాటేశాడు మన డైరెక్టర్.

నటన పరంగా చూసుకుంటే ఆర్య సాలిడ్ గా చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో ఆర్య గురించి చెప్పడానికి ఏముంది, అద్భుతంగా చేశాడు.  ఇక ఆర్యకు జంటగా నటించిన ఐశ్వర్య లక్ష్మి పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. సైంటిస్ట్ గా నటించిన సిమ్రాన్ కాస్త పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన ఇమాన్ నేపధ్య సంగీతం పట్ల మాత్రమే తన దృష్టిని పెట్టాడు. హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఒకవేళ హాలీవుడ్ సినిమాలను చూసే అలవాటు లేని వాళ్ళు ఒకసారి చూడవచ్చు. మొత్తానికి కెప్టెన్ ఆర్య ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ టైం బెటర్ లక్.

మరింత సమాచారం తెలుసుకోండి: