తమిళ చిత్ర పరిశ్రమలోని చాలామంది హీరోలు తెలుగులో ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. తెలుగు హీరోలతో సమానంగా వారు తమ సినిమాలను ఇక్కడ కూడా విడుదల చేస్తూ తమ సత్తా చాటారు.  వారు తమిళంలో చేసే ప్రతి సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తూ ఇక్కడ కూడా మంచి మార్కెట్ను ఏర్పరచుకున్నారు. రజనీకాంత్ కమల్ హాసన్ ఆ తర్వాత సూర్య విక్రమ్ విజయ్ దళపతి వంటి హీరోలు తెలుగులో తమ సినిమాలను విడుదల చేసి తెలుగు హీరోలకు సమానంగా క్రేజ్ ఏర్పరచుకున్నారు .

ఆ విధంగా ఇప్పుడు తెలుగులో మరి కొంతమంది యువ హీరోలు తమ సత్తా చాటడానికి సిద్ధమవుతూ ఉండగా మరొకసారి తెలుగులో పోయిన క్రేజ్ ను తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు శింబు. చెప్పాలంటే శింబుకు తెలుగులో గతంలో మంచి మార్కెట్ ఉంది. కానీ దానిని ఆయన చేజేతులా పోగొట్టుకున్నాడని చెప్పాలి. ఆయన సినిమాలకు వచ్చిన కొత్తలో చేసిన సినిమాలతో ఇటు తెలుగులో అటు తమిళ భాషలలో రెండు భాషలలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. స్టార్ హీరోగా ఎదిగాడు.

కానీ మధ్యలో ఆయన చేసిన కొన్ని పొరపాట్లు ఆయన కెరియర్ నాశనం అయ్యేందుకు దారితీసింది. కొన్ని రోజులు ఆయన సినిమాలు చేయకుండా దూరంగా ఉన్నాడు చేసిన సినిమాలన్నీ కూడా ఆయనను ఏమాత్రం తిరిగి ఫామ్ లోకి వచ్చేలా చేయలేదు ఆ విధంగా చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ హీరోగా నిలదుకుకునే ప్రయత్నం చేస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోగా ఇప్పుడు తెలుగులో కూడా పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఆయన తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన సినిమాను తెలుగులో ముత్తు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమా ఆయనకు బాగా వర్కౌట్ అయ్యే తిరిగి మంచి గుర్తింపు తీసుకువస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: