టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. కొరటాల శివ మిర్చి మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు . మొదటి మూవీ తోనే కొరటాల శివ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందు కోవడం మాత్రమే కాకుండా దర్శకుడి గా ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను కూడా అందు కున్నాడు.

కొరటాల శివ ఆ తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ లో చిరంజీవి హీరోగా నటించిన రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవి చూసింది.

ఇది ఇలా ఉంటే కొరటాల శివ కూడా తన కెరీయర్ లో దర్శకత్వం వహించిన మూవీ లలో ఆచార్య సినిమాతో మొట్ట మొదటి అపజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొన్నాడు.  మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ , ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నాడు. ఇది వరకు కొరటాల శివ సినిమాకు తన సినిమాకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా , ఆ మూవీ బిజినెస్ వివరాలు అలాగే మరికొన్ని విషయాలను కూడా పట్టించుకుంటు ఉండేవాడట.  కానీ ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ సినిమా విషయంలో కొరటాల శివ కేవలం కథ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: