తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ ,  ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్న యువ హీరోలలో ఆది సాయికుమార్ ఒకరు. ఆది సాయికుమార్ 'ప్రేమ కావాలి' మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో , ఆ తర్వాత లవ్లీ మూవీ లో హీరోగా నటించాడు. లవ్లీ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇలా వరుస విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి క్రేజ్ ని అందుకున్న ఆది సాయికుమార్ ఆ తర్వాత అనేక మూవీ లలో హీరోగా నటించినప్పటికీ ప్రేమ కావాలి , లవ్లీ రేంజ్ విజయాలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ఆది సాయికుమార్ కి ఇప్పటి వరకు దక్కలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది సాయికుమార్ 'తిస్ మర్ ఖాన్' అనే మూవీ లో హీరోగా నటించాడు. 

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర ఆది సాయికుమార్ కు మంచి విజయాన్ని తీసుకురాలేక పోయింది. ఈ మూవీ లో పాయల్ రాజపుత్ , ఆది సాయికుమార్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది సాయికుమార్ 'టాప్ గేర్' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. శశికాంత్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ తో అయినా ఆది సాయికుమార్ మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: