సినిమా విడుదలై విజయం అందుకుందంటే అందరూ హ్యాపీగా ఉంటారు.. లేదంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా డబ్బు చుట్టూ నడిచే ప్రపంచంలో ఇదంతా సహజమే అని చెప్పవచ్చు. దీంతో నష్టపోయిన బయ్యర్లకు నిర్మాత నుంచి పలు సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. దీంతో నష్టం లక్షలలో ఉన్నా.. కోట్లల్లో ఉన్నా ఆ సమస్యలు తొలగిపోయే వరకు అదంతా భారంగానే ఉంటుంది.. ఇక గడిచిన కొన్ని నెలల క్రితం విడుదలైన ఆచార్య సినిమా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నది.. ఈ విషయం సీరియస్ కావడం వల్లనే బయ్యర్లకు సెటిల్ చేసినట్లు మీడియాలో కథలు వినిపించాయి.


ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం లైగర్ కూడా భారీ స్థాయిలో డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఇక పూరి జగన్నాథ్ బ్రాండ్ కారణంగానే ఈ సినిమాకి మరింత హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు. దీంతో బయ్యర్లు ఈ సినిమాని నమ్ముకొని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తీసుకున్నారు. అయితే ఈ సినిమా తీవ్రమైన స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో వివిధ కేంద్రాల పెద్ద మొత్తంలో నష్టాన్ని బయ్యర్లు చవిచూసినట్లు తెలుస్తోంది..దీంతో  ఛార్మి ని బయ్యర్లు ఆశ్రయించినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

బయ్యర్ల నష్టాన్ని పూరించే బాధ్యతను పూరి జగన్నాథ్ , ఛార్మి తీసుకుంటున్నట్లుగా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఆ తరువాతే తాము కూడా చాలా నష్టపోయామని తిరిగి చెల్లించేందుకు తమ దగ్గర చేతిలో డబ్బులు లేవని తమ బాధ్యత కాదు అన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోని బయ్యర్లు అంత  ఒక్కటిగా కలుసుకొని.. పూరి జగన్నాథ్ కార్యాలయంలో సెటిల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరొక వార్త ప్రకారం పూరి జగన్నాథ్ కార్యాలయం ఎదుట ఎలాంటి పరిహారం చెల్లించడానికి సిద్ధంగా లేకపోవడంతో ఈ సమస్యను ఫిలిం చాంబర్ వరకు వెళ్లిందన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: