మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రవితేజ హీరో గా ఇడియట్ మూవీ తో అదిరి పోయే గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత అనేక విజయాలను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకున్న రవితేజ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రవితేజ ఈ సంవత్సరం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి , శరత్ మండువ దర్శకత్వంలో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం రవితేజ వరుస మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ని కొనసాగిస్తున్న రవితేజ మరో దర్శకుడు కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది వరకే రవితేజ , సంపత్ నంది కాంబినేషన్ లో బెంగాల్ టైగర్ మూవీ తెరకెక్కింది. అప్పట్లో బెంగాల్ టైగర్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇప్పటికే సంపత్ నంది ,  రవితేజ కు ఒక కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన రవితేజ వెంటనే సంపత్ నంది మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే సంపత్ నంది ఆఖరుగా గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్ గా తెరకెక్కిన సిటిమార్ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: