బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ తాజాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కిన బ్రహ్మాస్త్రం అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించగా ,  అమితా బచ్చన్ ,  నాగార్జున , మౌని రాయ్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు.

మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. మొదటి నుండే ప్రేక్షకుల్లో బ్రహ్మాస్త్రం మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యం లో ఈ మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ లభించాయి.  ఈ మూవీ 2 D మరియు 3 D వర్షన్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న బ్రహ్మాస్త్రం మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 4.67 కోట్లు .
సీడెడ్ : 1.08 కోట్లు .
యూ ఏ : 1.08 కోట్లు .
ఈస్ట్ : 72 లక్షలు .
వెస్ట్ : 46 లక్షలు .
గుంటూర్ : 80 లక్షలు .
కృష్ణ : 47 లక్షలు .
నెల్లూర్ : 33 లక్షలు .
4 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాస్త్రం మూవీ 9.61 కోట్ల షేర్ , 18.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో బ్రహ్మాస్త్రం మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: