తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ బాబు ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచు కున్నాడు. ఇది ఇలా ఉంటే సుధీర్ బాబు తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరో గా నటించాడు .

మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుధీర్ బాబు ,  మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ...  మహేష్ బాబు మూవీ లలో వన్ నేనొక్కడినే మూవీ ని మళ్లీ చేయాలని ఉంది. ఆ మూవీ కి దక్కవలసిన గౌరవం దక్కలేదు అని సుధీర్ బాబు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: