సినిమా పరిశ్రమలో సినిమాల విడుదల విషయంలో కొన్ని చిత్రాలు పోటీ పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడానికి కొన్నిసార్లు ఇతర సినిమాలతో పోటీ పడవలసి వస్తుంది. ఆ విధంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోగా ఉన్న నాగార్జున మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఓ సినిమాతో కలసి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఆయన చేస్తున్న ది గోస్ట్ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ చిత్రా నికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమా యొక్క టైలర్ ఇటీవల విడుదల చేసిన చిత్ర బృందం అందులో దసరాకు విడుద ల చేస్తామని ప్రకటించింది. అయితే ఆ సమయంలో మరొక పెద్ద హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా విడుదల కావడం ఈ చిత్రం పై ఎఫెక్ట్ చూపిస్తుందని ప్రతి ఒక్కరు కూడా భావించారు.

ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదల అవడం ఏ మాత్రం మంచిది కాదని కొంతమంది సిని మా  విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడో ఓ కే చేసుకున్న మెగాస్టార్ సినిమాను పోస్ట్ పోన్ చేసే కంటే నాగార్జున సినిమాను వాయిదా వేసుకుంటే మంచిదని అందరూ భావిస్తున్నారు. దానికి తగ్గట్లు గానే నాగార్జున కూడా తన సినిమాను వాయిదా వేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. మొన్నటిదాకా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ ఉండగా దానిని ముందుగా విడుదల చేయాలని ఆయన ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఘోస్ట్ సిని మా కి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: