కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన శింబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శింబు 'మన్మధ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈ హీరో నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేశాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదల అయిన మానడు మూవీ తో శింబు మంచి విజయాన్ని అందుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే శింబు తాజాగా ద లైఫ్ ఆఫ్ ముత్తు అనే సినిమాలో హీరోగా నటించాడు. గౌతమ్ మీనన్మూవీ కి దర్శకత్వం వహించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. గణేష్ ఈ మూవీ ని నిర్మించాడు. బ్రతకడం కోసం పట్నానికి వెళ్లిన ఒక పల్లెటూరి యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు ? అనేదే ఈ మూవీ కథ. ఈ మూవీ ని సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. మరి ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే మనాడు మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న శింబు 'ద లైఫ్ ఆఫ్ ముత్తు' మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: