తమిళ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది. వారి సినిమాలు బాగా ఉండి మంచి ఆదరణ ఉంటే మాత్రం తప్పకుండా వారి చిత్రాలకు భారీ స్థాయిలోనే కలెక్షన్లు వస్తూ ఉంటాయి. విజయ్ దళపతి సూర్య కార్తీ రజనీకాంత్ కమల్ హాసన్ వంటి హీరోలకు తెలుగులో భారీ స్థాయిలోనే మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ఉన్న కారణంగానే వారు తమ చిత్రాలను ఇక్కడ కూడా విడుదల చేస్తూ క్రేజ్ అందుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కొంతమంది తమిళ హీరోలు తెలుగులో సినిమాలను విడుదల చేస్తూ ఇక్కడ వారికి మార్కెట్ ఏర్పడే విధంగా చేసుకుంటూ ఉంటారు.

అలాంటి వారిలో శింబు కూడా ఒకరు. వాస్తవానికి ఆయనకు కొన్ని సంవత్సరాల క్రితమే తెలుగులో మంచి మార్కె ట్ ఏర్పడింది. మన్మధ వల్లభ వంటి సినిమాలతో తెలుగులో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ హీరో ఆ తరువాత తన సినిమాలతో ప్రేక్షకులను అలరించలేకపోయారు. కారణంగా తెలుగు ప్రేక్షకులకు దాదాపుగా దూరమైపోయారనే చెప్పాలి. అయితే ఇటీవల ఆయన హీరోగా చేసిన ఓ సినిమా తమిళంలో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించడంతో ఆయనకు మళ్ళీ ఇక్కడ క్రేజ్ వచ్చింది అనే చెప్పాలి.

దానిని ఉపయోగించుకుంటూ శింబు నటిస్తున్న తాజా సినిమాను ఇక్కడ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆయన నటించిన ముత్తు సినిమా తెలుగులో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా తెలుగులో ఈ సినిమాను అందరూ తప్పకుండా చూసి అలరించాలి అనేది ఇప్పుడు చెబుతున్న మాట. సినిమాలను తెరకెక్కించడంలో గౌతమ్ మీనన్ కు ఎంతటి అనుభవం ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: