తెలుగు ప్రేక్షకులకు మహేష్ బాబు పేరు పరిచయం అక్కర్లేని పేరు..ముఖ్యంగా అమ్మాయిలకు కలల రాకుమారుడు అని చెప్పాలి.ఎన్నో హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు.. ఒకవైపు  బిజిగా సినిమాలు చేస్తూనే మరో వైపు యాడ్ లు, ప్రమోషన్స్‌ ను కూడా చేస్తున్నారు.టాలీవుడ్ నుంచి దాదాపు 10 కి పైగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, సినిమాలోనే కాదు కమర్షియల్ యాడ్స్ లోను నెంబర్-1 అనిపించుకుంటున్నాడు..


ఈ నేపథ్యంలో ఓ ఛానెల్ లో ప్రసారం కానున్న సీరియల్ కు ప్రమోషన్ ను చేస్తున్నారు. కూతురు సితార తో కలిసి మహేష్ బాబు “పడమట సంధ్యారాగం” అనే కొత్త సీరియల్ కోసం ఒక ప్రమోషనల్ వీడియో లో నటించారు. ఆ ప్రోమో సంబంధిత ఛానల్ ప్రసారం అవ్వడంతో, ఆ సీరియల్ పై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే ఛానల్ వారు మహేష్ బాబు క్రేజ్ ని ఉపయోగించుకుని మరో రెండు కొత్త సీరియల్స్ ని ప్రమోట్ చేస్తూ.. ‘మహేష్-సితార’ల పై ఒక ప్రమోషనల్ సాంగ్ ని కూడా షూట్ చేసింది..


ఈ సాంగ్ ప్రోమోను సితార తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. “నాన్నతో నటించడం, నాకు ఒక అద్భుతమైన అనుభవం.ప్రోమో షూటింగ్‌ సమయం లో నాన్నతో చాలా ఎంజాయ్‌ చేశాను” అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. మూడు నిమిషాల నిడివి ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.. వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెర పై కూడా కనిపించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు.. ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు... ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో మాత్రం సోషల్ మీడియా లో చక్కర్లు కోడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: