టాలీవుడ్ లో మెగా హీరో గా పరిచయం అయ్యాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అయితే ఈయన విభిన్నమైన సినిమాలను చేస్తూ తన నటనలో కూడా వేరియేషన్స్ చూపిస్తు ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాడు.


వరుణ్ మొదటి నుండి కూడా డేరింగ్ స్టెప్పులు వేస్తూ ఆడియెన్స్ ను తన నటనతో అలరిస్తున్నాడు.


మిగతా మెగా హీరోల కంటే కూడా తెలివిగా డిఫెరెంట్ జానర్ సినిమాలు చేస్తూ ఈయనకంటూ స్పెషల్ గుర్తింపు అయితే తెచ్చుకోవడంలో సఫలం అయ్యాడు. ఇటీవలే వరుణ్ తేజ్ గని, ఎఫ్ 3 సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఇందులో గని ప్లాప్ అవ్వగా మళ్ళీ వెంటనే ఎఫ్ 3 సినిమా తో హిట్ ట్రాక్ ఎక్కాడు..


ఇక ఇప్పుడు వరుణ్ తన 12వ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాడ ట.. ఇది కూడా డిఫెరెంట్ జానర్ లో తెరకెక్కుతుంది. ఇప్పటి కే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రెగ్యురల్ షూట్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బైనార్ పై బివిఎస్ఎన్ నిర్మిస్తున్నాడు.


  ఇది ఇలా ఉండగా తాజాగా వరుణ్ తేజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తన 13వ ప్రాజెక్ట్ కోసం వరుణ్ సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ చేస్తూ ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేసారు.. ఈ వీడియోలో వరుణ్ ఎదో స్క్రిప్ట్ చదువుతున్నట్టు కనిపించాడు..

దీని బట్టి ఈ సినిమా దేశ భక్తి సినిమా నేపథ్యంలో ఉంటుంది అని భావిస్తున్నారు. ఈ సినిమా గురించి ఫుల్ డీటెయిల్స్ 19 సెప్టెంబర్ న చేయబోతున్నారు.. ఇలా వరుణ్ తేజ్ నుండి మరి డిఫెరెంట్ ఫ్రెష్ సబ్జెక్ట్ రావడంతో ఈ సినిమాపై ఆసక్తి కలుగుతుందట..మరి చూడాలి ఈ సినిమాల్తో వరుణ్ ఎలాంటి విజయం సాధిస్తాడో...

మరింత సమాచారం తెలుసుకోండి: