నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ ,  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. శృతి హాసన్మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది.

ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తూ ఉండగా , దునియా విజయ్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించ బోతున్నడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ తో బాలకృష్ణ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఈ మూవీ యూనిట్ చేపట్టనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో ఈ మూవీ ని నిలపాలి అని మూవీ మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: