సురక్షిత ఆరోగ్య న్యాయమైన జీవితం అనేది ప్రతి ఒక్కరి హక్కు అని.. శాంతితోనే అది సాధ్యమని మాజీ ప్రపంచ సుందరి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఐక్యరాజ్యసమితి వేదికగా తెలిపింది.ప్రియాంక ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో ఉంది.తాజాగా ఐరాసా రాయబారిగా ప్రపంచ శాంతి సుస్థిరత కోసం పాటుపడుతూ ప్రియాంక ప్రసంగం చేసింది. అనంతరం ప్రపంచ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ తోపాటు సామాజిక కార్యకర్త అమండా గోర్మన్ తదితరులతో ఈమె ఫొటోలు దిగి షేర్ చేసింది. ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయ సంఘీభావం అత్యంత ముఖ్యమైనదని ఆమె అన్నారు.ప్రపంచం పరిస్థితులు బాగా లేవని.. కోవిడ్ తో వినాశకర ప్రభావం నుంచి బయటపడలేకపోయామని.. పర్యావరణ సంక్షోభంతో జీవనోపాధి దెబ్బకొడుతూనే ఉందన్నారు. ఘర్షణలు పేదరికం ఆకలి అసమానతలు.. సుధీర్ఘకాలం పాలుపడుతోన్న న్యాయపూరిత సమాజపు నాదులను నాశనం చేస్తున్నాయన్నారు. 2030లోపు ఈ లక్ష్యాలను మనం పూర్తి చేయాలని.. కానీ మిగిలిన 8 ఏళ్లలో ఈ లక్ష్యాలను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.భూమిని రక్షించుకునే విషయంలో అందరి జీవితాలను మెరుగుపరుచుకునేందుకు విశ్వ కార్యాచరణ కావాల్సిన అవసరాన్ని ప్రియాంక గుర్తు చేసింది.


మన ప్రపంచం భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని చెప్పింది.అయితే ప్రియాంకపై గతంలో పాకిస్తాన్ సహా పలు దేశాలు ఆరోపణలు గుప్పించాయి. ఐరాసా అంబాసిడర్ గా ఉంటూ పాక్ తీరును కడిగేసి భారత్ వైమానిక దాడులను ప్రియాంక చోప్రా సమర్తించడం నాడు చర్చనీయాంశమైంది. దీనిపై భారతీయులు హర్షం వ్యక్తం చేయగా.. పాక్ సహా కొందరు అభ్యంతరం తెలిపారు.పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సమర్థించింది. భారత పౌరురాలుగా ఆమె వాదన వినిపించింది. అయితే ప్రియాంక ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో ఉంది. లాస్ ఎంజెల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిపై పాక్ మహిళ ఆయేషా అందరి ముందే ప్రియాంకను నిలదీసింది. దీనిపై ప్రియాంక కూడా గట్టిగానే బదులిచ్చింది. తన దేశం పట్ల అభిమానాన్ని వెల్లడించే హక్కు తనకు ఉందని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: