గత ఏడాది డిసెంబరులో  పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. అయితే  ఈ నేపధ్యంలో దేశంలో సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ అంటే పుష్ప-2నే.ఇక దాంతో బిజినెస్ వర్గాల్లోనూ పుష్ప-2 మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది.. సినిమా ఎప్పుడు పూర్తయి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.ఇక  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రైట్స్ కోసం అప్పుడే ఫైట్ మొదలైందని సమాచారం.అయితే ఇప్పటికే amazon Prime, Netflix భారీ ఆఫర్స్ తో ఈ చిత్రం నిర్మాతలు మైత్రీ ముందుకు వెళ్లాలని సమాచారం.

 ఇంకా డీల్ ఫైనలైజ్ చేయలేదంటున్నారు. ఇకపోతే వేలం పాట తరహాలో ఇద్దరూ రేట్లు పెంచుకుంటూ పోతున్నారట.అయితే  ఈ సినిమా ఓటిటి డీల్ ని లాక్ చేసుకోడానికి అయితే నెట్ ఫ్లిక్స్ వారు గట్టిగా ట్రై చేస్తున్నట్టుగా, తగ్గేదేలే అనే డైలాగులు చెప్తున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.ఇక  ఈ పోటీని చూస్తున్న డిస్నీ ..హాట్ స్టార్ తాము సీన్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట.  అల్లు అర్జున్ సొంత సంస్ద ఆహా మాత్రం సైలెంట్ గా ఈ పోటీని చూస్తూ ఉందిట. కాగా ఈ నేపధ్యంలో పుష్ప 2 ని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి చాలా రోజుల ముందే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ఎక్సపెక్టేషన్స్,

ప్రెజర్ బాగా ఎక్కువ అయిపోవడంతో సుకుమార్ అంత తేలిగ్గా స్క్రిప్టును లాక్ చేయలేదు. ఇక ముందు అనుకున్న కథను మార్చి.. నెలల తరబడి డిస్కషన్లు జరిపి చివరికి స్క్రిప్టు ఒక కొలిక్కి తెచ్చారు.అయితే  ఎట్టకేలకు రీసెంట్ గా 'పుష్ప-2' పూజ నిర్వహించారు.ఇదిలావుండగా  గత కొంతకాలంగా టూర్స్ లో ఉన్న బన్ని.. తిరిగి పుష్పరాజ్‌గా మారడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది.ఇప్పుడు  ఇంకాస్త జుట్టు, గడ్డం పెంచాల్సి ఉంది. ఇక తర్వాత ఒకసారి లుక్ టెస్ట్ చేయించుకుని షూటింగ్‌కు హాజరవుతాడు.అయితే ఈ లోపు మిగతా ఆర్టిస్టుల డేట్లు అవీ సర్దుబాటు చేసుకుని, షెడ్యూళ్లు పక్కాగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగుతుంది సుక్కు టీమ్. పార్ట్-2 షూటింగ్ వచ్చే ఏడాది జూన్‌కు పూర్తి కావచ్చని అంచనా.ఇక  ఆ తర్వాత మూడు నెలలు గ్యాప్ పెట్టుకుని దసరా టైంకి సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: