ఒకప్పుడు ఓ మెరుపు మెరిసిన ముద్దుగుమ్మల్లో  ఒకరు పూనమ్ కౌర్ ఒకరు.. ఏవో కొన్ని సినిమాలు తీసి.. మంచి గుర్తింపు పొందిందిన కూడా పెద్దగా సినిమా లలో రానించలెక పోయింది.ఒకటి రెండు సినిమాలు తీసినా కూడా అవి పెద్దగా ఆకట్టు కోలేక పోయాయి.. ఇప్పుడు మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చింది..ఆ సినిమా ఎ మాత్రం పేరును తీసుకు వస్తుందో చూడాలి.. ఆ తర్వాత ఏదొక వార్త తో హైలెట్ అవుతు వస్తుంది.. పవన్ కళ్యాణ్ ను ప్రెమించాను అంటూ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అబార్షన్‌ పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు వివాహితులై ఉండాల్సిన నియమం ఏమీ లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది..


సుప్రీంకోర్లు ఇచ్చిన ఈ తీర్పు పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెట్టింట తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతిస్తూ.. గర్భం దాల్చిన తర్వాత పురుషులు తమ రిలేషన్ షిప్‌కు కట్టుబడి ఉండమని బలవంతం చేయడం తాను చూశానని పూనమ్ కౌర్‌ చెప్పారు. తీర్పు నేపథ్యంలో పూనమ్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతు ఇస్తున్నా. స్త్రీలు పెళ్లిని, ఆర్థిక భద్రత ను కాపాడుకునేందు కు గర్భం దాల్చడం చూశానని అన్నారు..


ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితమంతా అనేక విధాలుగా బాధపడాల్సి వస్తుందన్నారు. స్త్రీలు తమ పునరుత్పత్తి శక్తి ని స్వార్థ ప్రయోజనాల కోసం అవసరమయ్యే ఆయుధంగా ఉపయోగించుకోకూడదని సూచించిచారు. పూనమ్ చేసిన ఈ కామెంట్స్ ఎవరినో ఉద్దేశించి అన్నట్టుగా ఉన్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయం పై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ అమ్మడు అన్న మాటలు నెట్టింట చక్కర్లు కోడుతున్నాయు.. మొత్తానికి ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: