టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ జంటగా నటించిన ది ఘోస్ట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే.కాగా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా పై నిర్మాతలు కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టారు అంటూ సమాచారం అందుతుంది. అయితే అందుకే ఈ సినిమాను సాధ్యమైనంత ఎక్కువగా ప్రమోట్ చేసి ఎక్కువ చోట్ల విడుదల చేయాలని వారు భావిస్తున్నారట. ఈ సినిమా ను హిందీలో విడుదల చేయాలని నిర్ణయించారు. 

ఇక నాగార్జున ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా తో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లాడు, ఆ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకున్నా కూడా మంచి వసూళ్ల ని సొంతం చేసుకుంది.అయితే  అందుకే ఆ సినిమా స్టార్ గా ఈ సినిమాతో నాగార్జున హిందీ ప్రేక్షకుల ముందుకు వెళితే తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నాగార్జున మరియు చిత్ర యూనిట్ సభ్యులు హిందీలో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇప్పటి వరకు అక్కడ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా లేదు. ఇక అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ లేదా నిర్మాతలు సినిమాను కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు ముందుకు రావాల్సి ఉంది.

 ఇప్పటి వరకు అక్కడి నిర్మాతలు ఎవరు కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధంగా లేరని.. ఒకరిద్దరూ నిర్మాతలు ముందుకు వచ్చినా కూడా వారు భారీ ఎత్తున విడుదల చేసే పరిస్థితి లేదని చేతులెత్తేస్తున్నారు.ఈ సినిమా హిందీలో విడుదల అవుతుందా లేదా అనే విషయమై సస్పెన్షన్ నెలకొంది. అయితే ఇంతకీ ఈ సినిమా బిజినెస్ అక్కడ జరుగుతుందా లేదా అనే విషయంపై కూడా క్లారిటీ లేదు.ఇక  నాగార్జునతో పాటు ఈ సినిమా కి పోటీగా మెగాస్టార్ చిరంజీవి అక్టోబర్ 5వ తారీఖున తన గాడ్‌ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.కాబట్టి అంచనాలు కచ్చితంగా భారీగా ఉంటాయి, అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: