మోస్ట్ బ్యూటిఫుల్ ,  మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయిన సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సోనాల్ చౌహాన్ ఈ సంవత్సరం విడుదల అయిన ఎఫ్ 3 మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది.

ఎఫ్ 3 మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ ముద్దు గుమ్మ తన పాత్రతో ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోనాలి చౌహాన్  "ది ఘోస్ట్" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించగా ,  చందమామ కథలు , గుంటూర్ టాకీస్ ,  గరుడ వేగ వంటి మూవీ లకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ యంగ్ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన గ్రాండ్గా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కనుక మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నట్లు అయితే సోనాల్ చౌహాన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజీ సినిమా అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. మరి ది ఘోస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో ...  ఈ మూవీ ద్వారా సోనాల్ చౌహాన్ కు ఏ రేంజ్ క్రేజ్ లభిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: