గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 తేదీన తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రున్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర కాస్త మిక్సెడ్ టాక్ లభించినప్పటికీ ఆ టాక్ ప్రభావం ఏ మాత్రం ఈ మూవీ పై కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతున్నాయి. 3 రోజుల్లో మూవీ ప్రపంచ వ్యాప్తంగా పొన్నియన్ సెల్వన్ మూవీ సాధించిన కలెక్షన్ లు వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు :  73.55 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాలలో :  14.35 కోట్లు .
కర్ణాటక :  13.70 కోట్లు .
కేరళ :  9.75 కోట్లు .
రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 9.20 కోట్లు .
ఓవర్ సీస్ లో :  87.80 కోట్లు . 3 రోజుల బాక్స్ ఆఫీస్ run ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా పొన్నియన్ సెల్వన్ మూవీ 208.35 కోట్ల షేర్ , 107.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా పొన్నియన్ సెల్వన్ మూవీ ప్రస్తుతం అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేస్తుంది. ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ కలెక్షన్ లను టచ్ చేసి అదిరిపోయే రీర్ మార్క్ కలెక్షన్ టచ్ చేసింది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ , త్రిష ,  ముఖ్య పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: