గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి దేశ వ్యాప్తంగా దర్శకుడు గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇలా దేశ వ్యాప్తంగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దర్శకుడిగా ఏర్పరచుకున్న మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన భారీ ఎత్తున తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఇప్పటికీ కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా పొన్నియన్ సెల్వన్ మూవీ పై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించాడు.  నాగార్జున తాజాగా పొన్నియన్ సెల్వన్ మూవీ గురించి స్పందిస్తూ ... ఈ మూవీ ని మణిరత్నం అద్భుతంగా తెరకెక్కించాడు అని , ఇలాంటి అద్భుతాలు మణిరత్నం వల్లే సాధ్యం అవుతాయని నాగార్జున వ్యాఖ్యానించాడు. పొన్నియన్ సెల్వన్ ... మణిరత్నం ఎన్నో సంవత్సరాల కల అని ,  చాలా సార్లు ఈ మూవీ గురించి తనతో చర్చించానని నాగార్జున అన్నాడు.  మణిరత్నం దర్శకత్వం లో  గీతాంజలి మూవీ తీసిన క్షణాలు ఎప్పటికీ తనకు మధుర జ్ఞాపకాలు అని నాగార్జున తాజాగా చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: