టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే పలు హిట్ మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ మూవీ లో కృతి శెట్టి , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించబోతుంది. ఇది వరకే నాగ చైతన్య , కృతి శెట్టి కాంబినేషన్ లో బంగార్రాజు మూవీ తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా  ఇది ఇలా ఉంటే నాగ చైతన్య , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... నాగ చైతన్య , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు , ప్రియమణి పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: