ఎస్ .. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . ఒకవేళ నిజంగా నందమూరి బాలకృష్ణ మాత్రం ఆ సాహసం చేస్తే డెఫినెట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద మెగా ఫ్యామిలీ పరువు దారుణాతి దారుణంగా పడిపోయినట్టే అంటూ సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
మనకు తెలిసిందే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ప్రాజెక్టు ఆచార్య. ఈ సినిమాలో మెగా వారసుడు రామ్ చరణ్ కూడా కీలకపాత్రలో మెరిసారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో దూసుకుపోతుందని అంతా భావించారు . సినిమా ప్రమోషన్స్ కూడా ధామ్ ధూమ్ అంటూ చేశారు ఆచార్య టీం. సీన్ కట్ చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . మెగాస్టార్ కెరియర్ లోనే ఫస్ట్ టైం ఇంత చెత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంతో బాక్సాఫీస్ వద్ద మెగా ఫ్యామిలీ పరువు సగం పోయిన్నట్లైంది. అయితే మిగతా సగం పరువును మెగాస్టార్ చిరంజీవిఈవెంట్ లో మాట్లాడుతూ ..సినిమాని తెరకెక్కించేటప్పుడు డైరెక్టర్ స్క్రిప్టుపై కాన్సన్ట్రేషన్ చేయాలని.. ఓ సినిమాకి ప్రాణం పోసేది డైరెక్టర్ అని ..పరోక్షంగా కొరటాల శివాను డైరెక్షన్ నేర్చుకో అంటూ చులకనగా మాట్లాడారు. దీంతో కొరటాల శివ ఫ్యాన్స్ కు కోపం వచ్చింది .అయితే మెగాస్టార్ చిరంజీవి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కానీ కొరటాల శివ ఒక్కసారి కూడా ఆయనకు కౌంటర్ ఇవ్వలేదు . దానికి కారణం ఏంటో తెలియదు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ అయితే వైరల్ గా మారింది.

త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్ లో బాలయ్య ఓ సినిమాను చేయబోతున్నాడంటూ అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఫ్లాప్ ఇచ్చిన కొరటాల శివ.. బాలకృష్ణకు మాత్రం కచ్చితంగా హిట్ ఇస్తారని అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు గతంలో రామ్ చరణ్ "వినయ విధేయ రామ" సినిమా అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమాకు డైరెక్టర్ గా వర్క్ చేశారు బోయపాటి . అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

దీంతో బోయపాటిని ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు మెగా ఫ్యాన్స్. ఆ తర్వాత వెంటనే బాలకృష్ణతో అఖండ సినిమా తీసాడు బోయపాటి. ఈ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే స్ట్రాటజీ కానీ వర్కౌట్ అయితే మెగాస్టార్ చిరంజీవితో ఫ్లాప్ అందుకున్న కొరటాల.. కచ్చితంగా బాలకృష్ణతో హిట్ అందుకుంటాడు . ఒక్కవేళ అదే నిజం అయితే తప్పు డైరెక్షన్ లో కాదు..నటుల్లో ఉంది అన్న విషయం కన్ ఫామ్ అవుతుంది. అప్పుడు మెగాస్టార్ మాటలు తప్పు అన్నట్లేగా.. మరి చూడాలి కొరటాల శివ, బాలయ్యకు ఎలాంటి హిట్ ఇస్తాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: