తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ లలో త్రిష కూడా ఒకరు. దాదాపుగా రెండు దశాబ్దాల కెరియర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని సినిమాలలో నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో కాస్త తెలుగులో తక్కువ సినిమాలు నటిస్తున్నప్పటికీ ఈమెకు అభిమానులు మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇక వర్షం,నువ్వు వస్తానంటే నేనొద్దంటానా అనే చిత్రాలతో తన నటనతో ప్రేక్షకులకు చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.


త్రిష కెరియర్ విషయానికి వస్తే తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అని చెప్పవచ్చు. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ తెలుగు హీరోతో ప్రేమాయణం నడిపిందని కానీ ఆ ప్రేమ బ్రేకప్ అయ్యిందని ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో గతంలో నిశ్చితార్థం కూడా జరిగి క్యాన్సిల్ అయ్యిందని ఆ తర్వాత త్రిషకు శింబుతో వివాహం జరగనుంది అన్నట్లుగా పలు వార్తలు ప్రచారంలో జరిగాయి. కానీ ఇవన్నీ వాస్తవం కాలేకపోయాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో పలు ఆసక్తికరమైన వార్తలు చేసింది త్రిష వాటి గురించి తెలుసుకుందాం.


త్రిష మాట్లాడుతూ తను ఎందుకు వివాహం చేసుకోలేదని ప్రజలు తనని అడుగుతున్నారని మీ వయసు వారు ఈపాటికే వివాహం చేసుకొని ఉన్నారని అంటూ ఉంటారని.. అయితే వారు అడిగే విధానం తనకు నచ్చలేదని మీరు సాధారణంగా నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగితే మీకు సమాధానం తెలియజేస్తానని తెలియజేసిందట. ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి జీవించాలి అంటే అందుకు సరైన పార్ట్నర్ ని ఎంచుకోవాలి అని.. లేకపోతే ఇతర నటీనటుల మాదిరి విడాకులు తీసుకొని చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అలా తీసుకోవడం నాకు అసలు ఇష్టం లేదని.. ఇప్పటివరకు తీసుకున్న జంటలు కూడా విడిపోవడం తనకు ఇష్టం లేదని తెలియజేసింది. రాబోయే రోజుల్లో ఒక మంచి వరుడు దొరికితే ఖచ్చితంగా చేసుకుంటానని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: