
అయితే అప్పట్లో స్టార్ హీరో రేంజ్ సంపాదించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న ఈ ఇద్దరు హీరోలు కూడా కలిసి ఒక మల్టీ స్టార్స్ సినిమాలో నటించాలని అనుకున్నారట. ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన మల్టీస్టారర్ మాత్రం ఊహించని రీతిలో ఆగిపోయిందట. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఎమ్మెస్ రాజు అప్పట్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన ఇద్దరు యువ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారట.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో నీ స్నేహం అనే సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఉదయ్ కిరణ్ కి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో తరుణ్ తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఇదే కథను తరుణ్ కు వినిపించడంతో ఇక ఫ్రెండ్ క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ లేదనే.. సెకండ్ హీరో పాత్రలా లేదని కారణంతో రిజెక్ట్ చేశాడట. తద్వారా ఇక ప్రేక్షకులకు పరిచయం లేని జతిన్ గ్రేవాన్ తీసుకున్నారు. ఇక అంతేకాకుండా రవిబాబు తెరకెక్కించిన సోగ్గాడు సినిమాలో కూడా ఉదయ్ కిరణ్, తరుణ్ లను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఉదయ్ కిరణ్ కాదనడంతో బాలీవుడ్ హీరోతో తీశారు. కానీ సినిమా ఫ్లాప్ అయింది.