మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ ఈ సంవత్సరం గని మరియు f3 మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గని మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కాకపోతే కామెడీ ప్రధాన నేపథ్యంలో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా వరుణ్ తేజ్ తన కొత్త మూవీ ని ప్రారంభించాడు. ఈ మూవీ కి టాలీవుడ్ యువ దర్శకులలో ఒకరు అయినటు వంటి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరియర్ లో 12వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ యూనిట్ ఈ మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ,  ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను VT 12 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరించనుంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లండన్ లో ప్రారంభం అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ వరుణ్ తేజ్ షూటింగ్ కి సిద్ధం అవుతున్నట్లు తెలియజేసే ఒక చిన్న వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసిన అతి తక్కువ సమయంలోనే వైరల్ అయింది. ఈ మూవీ ని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీbగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ప్రవీణ్ సత్తార్ , నాగార్జున హీరోగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా తెరకెక్కిన ది ఘోస్ట్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయ్యి ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: