అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం త్రిష తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే త్రిష కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.

ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ్ లో ఎక్కువ మూవీ లు చేస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన తమిళ సినిమా "పొన్నియన్ సెల్వన్" లో త్రిష ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ కి గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించగా ,  చియాన్ విక్రమ్ ,  కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ కూడా ఈ మూవీ లలో ముఖ్య పాత్రలలో నటించారు.  ఇది ఇలా ఉంటే తాజాగా త్రిష తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చింది.

తాజాగా పెళ్లి గురించి త్రిష స్పందిస్తూ ... తాను జీవితాంతం కలిసి ఉండగలను అనే వ్యక్తి ఇతనే అని నమ్మకం కలిగాకే పెళ్లి చేసుకుంటాను అని , ఇప్పటివరకు నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్న నాకు నచ్చదు అని త్రిష పేర్కొంది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగితే సమాధానం చెబుతా . వివాహం చేసుకొని అసంతృప్తిగా ఉన్న వాళ్ళు నా చుట్టూ చాలా మంది ఉన్నారు. అలాంటి పెళ్లిలలో నేను ఉండాలనుకోవడం లేదు ,  పెళ్లయ్యాక విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు అని తాజాగా త్రిష పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: