లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు ఆయన శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఇండియన్ 2 అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని కలెక్షన్ ల వర్షం కురిపించిన భారతీయుడు మూవీ కి సీక్వెల్ గా తిరక్కెక్కుతోంది. భారతీయుడు మూవీ ద్వారా హీరోగా కమల్ హాసన్ కు దర్శకుడిగా శంకర్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది.  

ఇండియన్ 2 మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయినప్పటికీ ,  కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ కొంత కాలం పాటు నిలిచి పోయింది.  తిరిగి ఈ మధ్యనే ఈ మూవీ షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో కనిపించ బోతున్నారు. ఈ మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మూవీ ని వచ్చే సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు ,  అందుకు అనుగుణంగా ఇండియన్ 2 మూవీ షూటింగ్ ని కూడా చిత్ర బృందం పూర్తి చేస్తూ వస్తున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన భారతీయుడు మూవీ కి సీక్వల్ గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దర్శకుడు శంకర్ తన పూర్వ మూవీ ల మాదిరి గానే అదిరి పోయే రేంజ్ లో గ్రండియర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: