అక్కినేని నాగార్జున తన కెరియర్ లో 100వ సినిమా చేయడానికి ఇప్పుడు సిద్ధం అవుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నాగార్జున ఇప్పుడు తన తదుపరి సినిమాను చేసే విధంగా ముందుకు వెళుతూ ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆయన 100 సినిమా విషయంలో అభిమానులు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పాలి. వాస్తవానికి ఇతర సీనియర్ హీరోలు తమ వందవ సినిమా విషయన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారు ఆ సినిమాలను చేయడం జరిగింది.

ఆ తరహాలోనే నాగార్జున కూడా తన వందవ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో చేయాలని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విధంగా కలలు కంటున్న అక్కినేని అభిమానులకు నాగార్జున చేస్తున్న చర్యలు కొంత అయోమయానికి గురి చేస్తున్నాయి అని చెప్పాలి. ఒక పెద్ద దర్శకుడు తో ఆయన తన వందవ సినిమా చేయాలని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఓ కొత్త దర్శకుడు తో ఆయన ముందుకు వెళుతున్నాడు అనే విషయం వారిని ఎంతగానో నిరోత్సాహపరుస్తుంది.

 అసలే గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏ మాత్రం ఆలోచించలేకపోతున్న నాగార్జున పై ఎన్నో రకాల విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. ఆయన హీరోగా చేయడం మానేయాలని చెబుతున్న నేపథ్యం లో ఒక భారీ విజయం ఆయన అందుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఏర్పడింది. ఇప్పుడు చేయబోయే తన వందవ సినిమా భారీ స్థాయిలో ఉండాలని భారీ కలెక్షన్లను అందుకోవాలని వారు భావిస్తున్నారు. అది సాధ్యం కావాలి అంటే ఒక భారీ దర్శకుడు తో మాత్రమే సాధ్యం అవుతుంది కానీ నాగార్జున ఆలోచనలు ఆ విధంగా లేకపోవడం నిజంగా వారిని అయోమయానికి గురిచేస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతానికైతే నాగార్జున తదుపరి సినిమా ఎవరితో చేస్తున్నాడు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఆయన తన సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: