విజయ్ దేవురకొండ హిట్లు, ఫ్లాపులు, రివ్యూలు, రికార్డులతో సంబంధం లేకుండా ఇండియావైడ్ గా సెన్సేషన్‌ మెయింటెయిన్ చేస్తున్న స్టార్‌ హీరో.కానీ కొన్నాళ్లుగా మాత్రం టైమ్‌ బ్యాడయి డిజాస్టర్లలో వరుస రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత భారీగా పెరిగిన రేంజ్‌ అండ్ క్రేజ్‌ వల్ల తర్వాతి సినిమాలతో బడా హీరోగా రికార్డులు క్రియేట్‌ చేద్దామనుకున్నాడు.

అనుకున్నట్టుగానే గీతగోవిందం,

ట్యాక్సీవాలా వంటి చిత్రాలు కూడా హిట్టయ్యాయి. ఒక్కోటి ఒక్కో జానరవడం వల్ల ఆడియెన్స్‌ కూడా ఎంజాయ్‌ చేశారు. కానీ ఆ తర్వాతే మొదలయ్యాయి విజయ్ కి అసలు కష్టాలు.

ఈ విజయాల్ జోష్ తో ఇతర ఇండస్ట్రీల్లోకి కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి పరభాషల్లోనూ స్టార్లకి పోటీ ఇవ్వాలనుకున్నాడు. దాంతో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన నోటా మూవీలో నటించి సౌత్ వైడ్ గా సత్తా చాటాలని కలలు కన్నాడు. కానీ రిజల్ట్ డిజాస్టర్ గా తేలడంతో రూ. 14. 06 కోట్ల లాస్ మిగిలింది పాపం.

ఇక ఈ పాలిటిక్స్‌ బ్యాక్ డ్రాప్స్‌ కాకుండా మనకు కలిసొచ్చిన లవ్ స్టోరీ, బ్రేకప్‌ జానర్లోనే చెలరేగిపోదామని డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించాడు. సౌత్ లో అన్నిభాషల్లోనూ భారీ హైప్ తో రిలీజయినా ఏ ఇండస్ట్రీలోనూ మినిమ్ పాజిటివ్ టాక్ కూడా దక్కించుకోలేకపోయింది. దాంతో బ్రేక్‌ ఈవెన్ కూడా సాధించలేక రూ. 14 కోట్ల నష్టం తేలింది.

ఈప్లాప్ ల పరంపర నుంచి బైటపడి సౌత్ వైడ్ గా ఫేమ్‌ కాపాడుకోవాలన్న ప్లాన్‌ తో వరల్డ్ ఫేమస్ లవర్ ప్రాజెక్ట్‌ కి ఓకే చెప్పాడు రౌడీ స్టార్.

ముగ్గురు హీరోయిన్లతో సినిమా అనేసరికి ఇక రొమాన్స్‌ తో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తాడని ఆడియెన్స్‌ ఎక్స్‌ పెక్ట్‌ చేశారు. కానీ ఆ మూవీ కూడా హ్యాట్రిక్ ఫ్లాపయి రూ. 21.30 కోట్ల నష్టాన్ని వెనకేసుకుంది. ఇక లాభం లేదు, లైగర్ తో ఈ ఫ్లాపుల స్ట్రీమ్‌ నుంచి బైటపడాలని ప్లాన్ వేసుకున్నాడు. పూరీతో కలిసి బాక్సాఫీస్ కి ఆగ్ అంటించేయాలని ఫిక్సయ్యాడు. కానీ రియాలిటీలో ఏం జరిగిందో తెలిసిందేగా.
భారీ డిజాస్టర్ టాక్‌ తో రూ. 62. 35 కోట్ల నష్టాన్ని దక్కించుకుంది.

ఇలా పట్టుకందల్లా ఫ్లాప్‌ అవడంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ డౌన్ ఫీలవుతున్నారు. ఆ మాటకొస్తే విజయ్ దేవరకొండ కెరీర్‌ కి కూడా ఇది పెద్దదెబ్బే. ఒక్క డిజాస్టర్ పడితేనే తట్టుకోవడం కష్టమై తర్వాతి సినిమా మీద పెద్ద ప్రభావమే పడుతున్న రోజులివి. అలాంటిది అన్ని కోట్ల బడ్జెట్‌ తో హీరో బ్రాండ్ ని నమ్ముకుని సినిమా తీస్తే కనీసం పెట్టిన డబ్బులయినా రాకపోగా ఈ రేంజ్‌ నష్టాలంటే రానున్న రోజుల్లో కష్టమే ఇక.

దాంతో తన ఆశలన్నీ ఖుషీపైనే పెట్టుకున్నాడు విజయ్‌ దేవరకొండ. శివ నిర్వాణ డైరెక్షన్లో వస్తోన్న ఖుషీ చిత్రంలో సమంతకు జోడీగా నటిస్తున్నాడు రౌడీ స్టార్. కాశ్మీర్ బ్యాక్‌ డ్రాప్‌ తో ఈ మూవీ కూడా తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో డిసెంబర్ 23 న విడుదల కానుంది. విజయ్‌ ని హీరోగా ఆడియెన్సుకు బాగా దగ్గర చేసింది లవ్ స్టోరీలే. ఈ మూవీ కూడా ప్రేమకథ నేపథ్యంలోనే తెరకెక్కుతుండడంతో సక్సెస్‌ సాధించి విజయ్‌ దేవరకొండ సక్సెస్ ట్రాక్ ఎక్కి, లాభాలతో లక్కు మారితేనే అభిమానులు కూడా ఖుషీ.

మరింత సమాచారం తెలుసుకోండి: