అక్టోబర్ 5న విడుదలైన గాడ్ ఫాదర్ మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసులు కురిపిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్‌, డైరెక్టర్ మోహన్ రాజా. నటుడు సత్యదేవ్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం గాడ్ ఫాదర్). మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వచ్చింది. అక్టోబర్ 5న విడుదలైన గాడ్ ఫాదర్ మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసులు కురిపిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్‌, డైరెక్టర్ మోహన్ రాజా), నటుడు సత్యదేవ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

లూసిఫర్ రీమేక్ చేయడం వెనుకున్న ప్రాధాన్యం గురించి డైరెక్టర్ మోహన్ రాజా మాట్లాడుతూ.. లూసిఫర్‌ను అందరూ చూశారు..వీళ్లెందుకు చేస్తున్నారు..వీళ్లకు బుద్దుందా లేదా..? అని కామెంట్లు వస్తుంటే..అవే ఛాలెంజ్‌గా తీసుకొని గాడ్ ఫాదర్ తీశామన్నారు. ఈ సినిమా రావడానికి కారణం సినిమాలోని కోర్ పాయింట్‌. నేను లూసిఫర్‌ను ఓ కథగా చూడను..ఒక ఐడియాగా చూస్తానన్నాడు.
రజినీకాంత్ భాషా ఎలా అయితే హీరోయిజానికి ట్రేడ్‌మార్క్‌గా నిలిచిందో..? దశాబ్దాల తర్వాత లూసిఫర్ అనేది ఆ హీరోయిజంను ఇంకో స్థాయికి తీసుకెళ్లే ఐడియా. జరిగింది చూపించం..జరుగబోయేది చూపించం. కానీ ఆ హీరో గురించి చెప్తే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి మంచి ఐడియాను చాలా బాగా చూపించవచ్చు. ఆ ఆలోచనకు పొటెన్షియాలిటి ఉందని గుర్తించాం. లూసిఫర్‌ను క్లాస్ యాంగిల్‌లో చూపించారు. ఆ ఐడియాను ఎన్నో యాంగిల్స్‌లో చూపించవచ్చు. మన ప్రాంతానికి మాస్ యాంగిల్ అయితే తాజాగా చాలా బాగుంటుందనిపించిందన్నాడు మోహన్ రాజా.

లూసిఫర్ చూసి అంచనాలు పెట్టుకునేవారికి గాడ్ ఫాదర్ ఇంకా నచ్చుతుంది. నెక్ట్స్ రాబోయే సీన్ అదే అని అనుకునే వారి అంచనాలకు అందకుండా తెలుగు వెర్షన్‌ థ్రిల్ అందిస్తుందని అనుకున్నాం. గాడ్ ఫాదర్‌లో ఎక్కువగా స్క్రీన్ ప్లేనే నమ్మాం. అదే సినిమాను చాలా కాపాడింది. సినిమాకు స్క్రీన్‌ప్లే చాలా ముఖ్యమని గాడ్ ఫాదర్ మరోసారి నిరూపించిందని మోహన్ రాజా చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి: