టాలీవుడ్ ఇండస్ట్రీలో  ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ.. కమెడియన్లలో ఒకరైన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక  ప్రకాశం జిల్లాకు చెందిన ధర్మవరం సుబ్రహ్మణ్యం మొదట పలు టీవీ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.ఇకపోతే ధర్మవరపు సుబ్రహ్మణ్యం సొంత ఊరు ప్రకాశం జిల్లాలోని కొమ్మనేని వారి పాలెం.. నాటకాల పైన ఎంతో ప్రీతి ఉండేదట.ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితుడైన ధర్మవరం సుబ్రహ్మణ్యం 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆ పార్టీ కోసం తన వంతు సహాయం చేసి గెలిపించారు.

దాదాపుగా పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యదర్శిగా కూడా పనిచేశారు. అయితే  ఇక 2013 వ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన కాలేయ క్యాన్సర్ తో బాధపడుతూ ధర్మవరం సుబ్రహ్మణ్యం మృతి చెందారు. కాగా ధర్మవరం సుబ్రహ్మణ్యం బతికి ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.అంతేకాదు  తమ ఊరు ప్రకాశం జిల్లాలో ఉందని, మా ఊరు నుంచి బస్సు ఎక్కి వెళ్లాలి అంటే దాదాపుగా 15 కిలోమీటర్లు వెళ్లాలని తెలియజేశారు సుబ్రహ్మణ్యం. అయితే తనను చూసే వారికి చాలా సీరియస్ గా కనిపించినా.. తన వృత్తి మాత్రం అందర్నీ నవ్వించడం అని తెలియజేశారు.

ఇకపోతే రాజకీయాలు అంటే బురద అని అయితే అంటకుండా కూడా ఉండవచ్చని ఆయన తెలియజేశారు. ఇక నేను పదవిని ఆశించలేదని రాజశేఖర్ రెడ్డి పిలిచి తనకు పదవి ఇచ్చారని ధర్మవరం సుబ్రహ్మణ్యం తెలిపారు. కాగా తను అప్పటివరకు దాదాపుగా 700కు పైగా సినిమాలలో నటించానని తెలిపారు.ఇక  రాజశేఖర్ రెడ్డి సినిమాలు ఎక్కువగా చూసేవారు కాదని.. ఎప్పుడైనా యాడ్ ఫిలిం లేదా సినిమా షోలకు రాజశేఖర్ రెడ్డిని లాక్కెళ్ళే వాడినని తెలియజేశారు.అయితే  వైయస్సార్ తనకు చాలా మంచి స్నేహితుడని కూడా తెలియజేశారు. అంతేకాకుండా మా ఇద్దరి మధ్య చాలా సన్నిహిత్య బంధం ఉందని కూడా తెలిపారు.కాగా  అప్పుడప్పుడు రాజశేఖర్ తన ఇంటికి పిలిచి భోజనం పెట్టే వారిని కూడా తెలిపారు. ఇక రాజశేఖర్ రెడ్డి సీఎం హోదాలో ఉన్న కూడా ఆ హోదాను ఎప్పుడూ కూడా ఎక్కడా చూపించలేదని తెలిపారు.అయితే  కేవలం ఒక సామాన్య మనిషి గానే తమతో కూడా అందరితో కలిసి పోయే వారని తెలిపారు సుబ్రహ్మణ్యం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: