ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ లో  ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్, ఫైట్స్ ఒక్కటేంటి అన్నింట్లోనూ అద్భుతం అనిపించకమానడు.అంతేకాదు తన అద్భుతమైన నటనతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మాయలో పడేయడం బన్నీ స్పెషాలిటీ . అయితే  ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' చిత్రం, పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుకుంది.కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' చిత్రం హిందీ వెర్షన్ 100 కోట్లకి పైగా రాబట్టడం విశేషం.ఇక అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప 2' నిర్మితమవుతోంది.

అయితే 350 కోట్లకి పైగా బడ్జెట్ ను ఈ చిత్రం కోసం కేటాయించారు.అంతేకాదు మరికొన్ని కొత్త పాత్రలను క్రియేట్ చేసి, వివిధ భాషల నుంచి ఆర్టిస్టులను తీసుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో అడవి నేపథ్యంలోని జంతువులను .. పాములను చూపించకపోవడం ఒక లోపంగా చెప్పుకున్నారు. ఈ సారి ఆ లోపాన్ని కూడా భర్తీ చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఈ సారి అడవిలో హీరో ఒక సింహంతో తలపడనున్నాడని అంటున్నారు.అయితే థాయ్ ల్యాండ్ ఫారెస్టులో ఈ సన్నివేశాన్ని ఒక రేంజ్ లో చిత్రీకరించడానికి రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ తన ఇంట్రడక్షన్ సీన్లోనే పులితో తలపడతాడు.ఇక ఆ సీన్ ఆ కథను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. ఐటీహెబ్అదే స్థాయిలో సింహంతో బన్నీ తలపడే సీన్ ఉంటుందని చెబుతున్నారు.కాగా  విజయ్ సేతుపతి .. అర్జున్ కపూర్ కూడా ఈ మూవీలో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సంగీతం అందించే పనిలోనే దేవిశ్రీ ఉన్నట్టుగా వినిపిస్తుంది..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: