గీతా ఆర్ట్స్.. టాలీవుడ్ లోనే ఓ అగ్ర నిర్మాణ సంస్థ అని మనందరికీ తెలిసిందే.అయితే  ఈ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన అల్లు అరవింద్..ఇకపోతే నాటి నుంచి నేటి వరకు ఎందరికో లైఫ్ ఇచ్చారు. అయితే ఇక  గీతా ఆర్ట్స్ లో అసలు `గీతా` అంటే ఎవరు అన్న సందేహం చాలా మందికి ఉంది. ఎందుకంటే  ఇక గీతా అన్న పేరుతో అల్లు ఫ్యామిలిలో ఎవ్వరు లేరు. అయితే మరి ఈ గీతా ఎవరు అన్నా కుతూహలం ఎందరికో ఉంది.ఇదిలావుంటే ఇక తాజాగా ఈ విషయంపై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇక  ప్రముఖ పాపులర్ టీవీ షో `ఆలీతో సరదాగా`లో పాల్గొన్న అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ లో గీతా అంటే ఎవరు అన్నదానిపై వివరణ ఇచ్చారు. ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ.. `గీతా ఆర్ట్స్ లో గీతా నా గర్ల్ ఫ్రెండ్ అనే డౌట్ చాలా మందిలో ఉంది. అంతేకాదు నిజంగానే నాకు గీతా అనే పేరుతో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఇక ఆమె పేరునే మా నిర్మాణ సంస్థకు పెట్టానని కొందరు అభిప్రాయపడుతుంటారు.అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదు.ఇకపోతే  గీత ఆర్ట్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థను పెట్టాలని ఒక ప్రపోజల్ పెట్టింది మా నాన్నగారు అల్లు రామలింగయ్య గారు.

ఇక  ఆయనకు భగవద్గీత పై విపరీతమైన నమ్మకం ఉండేది.అయితే  ఆ నమ్మకంతోనే భగవద్గీతలోని గీతా పేరు నిర్మాణ సంస్థకు పెట్టాలని ఆయన సూచించారు.ఇక  గీతలో చెప్పినట్టు పనిచేయడమే మన వంతు.. ఫలితం మన చేతిలో ఉండదు. ఇది సినిమాకు సరిగ్గా సరిపోతుంది.కాగా గీతకు దగ్గరగా ఉండడం వల్ల గీతా ఆర్ట్స్ పెడదామని నాన్నగారు అనడంతో అదే ఫైనల్ చేశాం` అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇకపోతే  ఇంతలో ఆలీ కల్పించుకుని.. `పెళ్లి తర్వాతైనా నిర్మల ఆర్ట్స్‌ పెట్టొచ్చు కదా` అని అనగా.. అందుకు అల్లు అరవింద్ అప్పటికే గీతా ఆర్ట్స్‌ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అయితే అందుకే పేరును మార్చలేదని నవ్వుతూ తెలిపారు.ఇక  మొత్తానికి అల్లు అరవింద్ వ్యాఖ్యలతో గీతా ఆర్ట్స్ లో గీతా అంటే ఏంటో అందరికీ స్పష్టంగా అర్థం అయిపోయింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: