కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి భారీ అంచనాల నడుమ బ్రహ్మాస్త్ర అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. తెలుగు లో ఈ మూవీ ని ఎస్ ఎస్ రాజమౌళి సమర్పించాడు. బ్రహ్మాస్త్ర మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ హీరోగా నటించగా ,  ఆలియా భట్ ఈ మూవీ లో రన్బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించింది. అమితా బచ్చన్ ,  నాగార్జున , మౌని రాయ్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ విడుదల అయిన బ్రహ్మాస్త్ర మూవీ విడుదల అయిన మొదటి రోజు , మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని బాక్సా ఫీస్ దగ్గర అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను కొల్ల గొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకున్న బ్రహ్మాస్త్ర మూవీ మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బ్రహ్మాస్త్ర మూవీ ప్రముఖ  "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 4 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరి కొన్ని రోజుల్లోనే వెలబడనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: