తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఈ సినిమాను జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవి తెరకెక్కించడం మరింత ప్రేక్షకులలో అంచనాలను పెంచేసింది. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జేఆర్సి కన్వెన్షన్ హాల్లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పెషల్ గెస్ట్లుగా వచ్చారు.


 ఈ క్రమంలోనే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన విజయ్ దేవరకొండ హీరో శివ కార్తికేయన్ గురించి చెప్పిన కొన్ని విషయాలు అందరినీ ఆకర్షించాయి. అంతేకాకుండా శివ కార్తికేయన్ లైఫ్ జర్నీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.. ప్రిన్స్ మూవీ ప్రమోషన్స్ లో నేను భాగమైనందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న. సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ అని రెండు బ్యానర్లు తన కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. సురేష్ ప్రొడక్షన్ వల్ల పెళ్లి చూపులు.. సునీల్ నారాయన్ గారి వల్ల అర్జున్ రెడ్డి అనే సినిమాతో మీ ముందుకు వచ్చాను.


 ఇక ప్రిన్స్ ట్రైలర్ చూసి ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఇక ప్రిన్స్ తో అనుదీప్ మరో హిట్టు కొడతాడని భావిస్తున్నా..  నటుడు శివ కార్తికేయ సార్ ని నేను ఎప్పుడు కలవలేదు. నాకు చాలా ఇష్టమైన యాక్టర్. నా పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయినప్పుడు రెమో సినిమా కూడా రిలీజ్ అయింది. ఇక ఆయన జర్నీ కూడా నాకు ఎంతో ఇష్టం. ఆయన స్టేజ్ పై ఏడుస్తుంటే మనలో ఒకరు ఏడుస్తున్నారని బ్రదర్ ఫీలింగ్ కలిగింది. ఆయన జర్నీ అందరికీ ఆదర్శం. ఇక ఆయన ఏడ్చినప్పుడే ఆయన కోసం ఏదైనా చేయాలనిపించింది. ఇక ఇప్పుడు ప్రిన్స్ సినిమా ప్రమోషన్ చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: