శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ప్రిన్స్‌'. అనుదీప్‌ కేవీ దర్శకుడు. సునీల్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మాతలు.ఈ నెల 21న విడుదలకానుంది.

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ప్రిన్స్‌’. అనుదీప్‌ కేవీ దర్శకుడు. సునీల్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మాతలు. ఈ నెల 21న విడుదలకానుంది. మంగళవారం ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్ర హీరో విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఏషియన్‌ ఫిల్మ్స్‌ నా సినీ ప్రయాణంలో కీలక పాత్రను పోషించాయి.'ప్రిన్స్‌’ ట్రైలర్‌ చూసి చాలా ఎంజాయ్‌ చేశాను. అనుదీప్‌ పెద్ద సినిమాలు చేయడం, అందరికి నవ్వులు పంచడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒత్తిడి నుంచి రిలీఫ్‌ కోసం అనుదీప్‌వీడియోలు చూస్తుంటా.

శివకార్తికేయన్‌ ' రెమో 'చూసినప్పటి నుంచి ఆయన సినిమాలపై ఇంట్రెస్ట్‌ పెరిగింది. శివ కార్తికేయన్‌ సినీ ప్రయాణం ఎంతో స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది. చాలా కష్టపడిపై కొచ్చాడు. నటుడిగా, నిర్మాతగా, గీత రచయితగా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా'అన్నారు. అనుదీప్‌ మాట్లాడుతూ 'ఈ కథ శివకార్తికేయన్‌ కోసమే తయారు చేశా. తమన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. పాటలు పెద్ద హిట్‌ అయ్యాయి. సినిమా అందరిని నచ్చుతుందనే విశ్వాసముంది' అని చెప్పారు.శివకార్తికేయన్‌ మాట్లాడుతూ 'మన ఇండియన్‌ సినిమాలో స్మార్టెస్ట్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ఆయన 'గీత గోవిందం' సినిమా చాలాసార్లు చూశా. విజయ్‌ దేవరకొండ జర్నీ రాకెట్‌లా దూసుకుపోతున్నది. తక్కువ సమయంలోనే పాన్‌ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయాలని ఉంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఏషియన్‌ ఫిల్మ్స్‌ వంటి పెద్ద సంస్థలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: