ఈ నగరానికి ఏమైంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్న విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ ద్వారా తనకంటూ ఒక గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్న ఈ హీరో ఆ తర్వాత ఫలక్ నమా దాస్ , హిట్ , పగల్ , అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ కి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా , మితాలీ పాల్కర్ ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఈ రోజు అనగా అక్టోబర్ 21 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో , ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ రోజు విడుదల అయిన ఓరి దేవుడా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎన్ని థియేటర్ లలో విడుదల కాబతుందో తెలుసుకుందాం.
ఓరి దేవుడా మూవీ నైజాం ఏరియాలో 150 థియేటర్ లలో విడుదల కాబోతుంది. సిడెడ్ లో ఈ మూవీ 60 థియేటర్ లలో విడుదల కాబోతోంది.  ఆంధ్రాలో ఈ మూవీ 200 థియేటర్ లలో విడుదల కాబోతోంది. మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 415 థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇలా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి భారీ మొత్తం థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: