రీసెంట్ గా కొన్ని రోజుల క్రితమే ఎన్నో వివాదాలు ఎదుర్కొని 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రంతో ఆకట్టుకున్నాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. ఇప్పుడు అతడి నుంచి వచ్చిన కొత్త సినిమా 'ఓరి దేవుడా'. 'ఓ మై కడవులే' అనే తమిళ సినిమా ఆధారంగా ఒరిజినల్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని రూపొందించాడు. దిల్ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి లాంటి అగ్ర నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక సినిమా విషయానికి వస్తే చాలా వరకు ఇందులో సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగిపోతాయి. కొన్ని చోట్ల కామెడీ బాగానే వర్కవుట్ అయిన ఈ సినిమాలో.. ఎమోషన్లు బాగా పండాయి. కాకపోతే స్లో నరేషన్ వల్ల అక్కడక్కడా బోర్ ఫీలింగ్ కలుగుతుంది. కథలో వచ్చే మలుపులు కొత్తగా అనిపించినా.. వాటికి ముందు వెనుక మాత్రం సినిమా రొటీన్ గానే అనిపిస్తుంది. చిన్నప్పట్నుంచి కలిసి పెరిగిన స్నేహితురాలు తనకు ప్రపోజ్ చేస్తే ఆమెతో పెళ్లికి ఓకే చెప్పిన కుర్రాడు.. ఆమెతో తనకు సెట్టవ్వక ఇబ్బంది పడే నేపథ్యంలో ప్రథమార్ధం నడుస్తుంది. తన మామ నడిపే టాయిలెట్ కమోడ్ ఫ్యాక్టరీలో హీరో పడే ఇబ్బందులు హిలేరియస్ గా అనిపిస్తాయి.


ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు వినోదాన్ని పంచే సీన్స్ ఉంటాయి.మెయిన్ గా సర్ప్రైజ్ చేసేది ఫాంటసీ యాంగిల్. ఆధునికంగా కనిపించే దేవుడిగా వెంకీ.. ఆయన అసిస్టెంటుగా రాహుల్ రామకృష్ణలతో కలిసి విశ్వక్సేన్ చేసిన సందడి ఆకట్టుకుంటుంది. హీరోకు దేవుడు రెండో ఛాన్స్ ఇవ్వడం దగ్గర ఇంటర్వెల్ మలుపు క్యూరియాసిటీ పెంచుతుంది.హీరో మళ్లీ జీవితంలో వెనక్కి వెళ్లి తన జీవితాన్ని మార్చుకునేందుకు చేసే ప్రయత్నాల నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లు క్రేజీగా అనిపిస్తాయి. సినిమా మొత్తానికి హైలైట్ గా అనిపించే ఎపిసోడ్ ద్వితీయార్ధంలో వస్తుంది. తాను మరోలా అర్థం చేసుకున్న హీరోయిన్ తండ్రికి సంబంధించిన నేపథ్యంలో.. అందులోని ఎమోషన్ ప్రేక్షకులను కదిలిస్తుంది. చాలా వినోదంగా అనిపించే ఈ సన్నివేశాలను దర్శకుడు బాగా డిజైన్ చేశాడు.ఓవరాల్ గా సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పాలి. సినిమా బాగా టైం పాస్ అవుతుంది. హ్యాపీగా చూసేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: